📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాజకీయాల్లో యువత పాత్ర దేశ భవిష్యత్తుకు మూల స్తంభం

రాజకీయాల్లో యువత పాత్ర దేశ భవిష్యత్తుకు మూల స్తంభం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (జులై 28 ప్రజావాణి) ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రగతి ఆ దేశ యువత ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం మొదటి వరుసలో ఉంది.స్వామి వివేకానంద అన్నట్టు యువత శక్తియే దేశ శక్తి. ప్రస్తుత ఆధునిక సమాజంలో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి యువత రాజకీయాలకు రావడం ఎంతో అవసరం.మార్పుకు నిలువెత్తు రూపం యువత  ప్రస్తుత రాజకీయాల్లో పాత ఆలోచనలు సాంప్రదాయ పద్ధతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కానీ యువత ఆలోచనలు నూతనంగా, ప్రగతిశీలంగా ఉంటాయి. వారు సమాజంలో ఉన్న అవినీతి, అసమానతలు నిరుద్యోగం వంటి సమస్యల పైన త్వరగా స్పందిస్తారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలను కొనగల సామర్థ్యం యువతకు ఉంది.రాజకీయాల్లో యువత ప్రాముఖ్యత:-నూతన ఆలోచనలు -ఆవిష్కరణలు: యువ నాయకులు సమాజానికి అవసరమైన వినూత్న పథకాలను విధానాలను ప్రవేశ పెట్టగలరు.సాంకేతికతను పాలనలో భాగం చేసి పారదర్శకతను పెంచగలరు.ప్రజాస్వామ్య బలోపేతం నేటి యువత విద్యతో పాటు సామాజిక స్పృహలు కలిగి ఉంది.వారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా సరైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. విద్యా,ఉపాధి,పర్యావరణం డిజిటల్ విప్లవం వంటి ఆధునిక అంశాలపై యువతకు పూర్తి అవగాహన ఉంటుంది. దీనివల్ల చట్టసభల్లో ఈ అంశాలపై లోతైన చర్చలు జరిగి మెరుగైన చట్టాలు రూపొందుతాయి, యువతలో మార్పు తీసుకురావాలనే తపన ఆదర్శాలు ఎక్కువగా ఉంటాయి.పాత తరం రాజకీయాల్లో పేరుకుపోయిన కుల, మత, డబ్బు రాజకీయాలను పక్కనపెట్టి కేవలం అభివృద్ధి ప్రాతిపదికన పనిచేసే తత్వం యువత సొంతం.ప్రస్తుత సవాళ్లు భారతదేశంలో సగానికి పైగా జనాభా యువత ఉన్నప్పటికీ చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. వారసత్వ రాజకీయాలు,రాజకీయాల్లో నేర చరిత్రలు పెరిగి పోవడం,డబ్బు ప్రభావం వల్ల సామాన్య యువత రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారు. అలాగే చాలామంది యువకులు రాజకీయాన్ని ఒక కెరియర్ గా ఎంచుకోవడానికి వెనకాడుతున్నారు.యువత కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా వారు ఓటు వేసే శక్తిగా మాత్రమే కాకుండా దేశాన్ని శాసించే చట్టసభల్లో అడుగుపెట్టాలి. యువత దేశ రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవులు పొందడం కాదు.వ్యవస్థలో మార్పు తీసుకురావడం. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది. మరియు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. యువత మేలుకొంటే.దేశం నడుస్తుంది అనే విధానాన్ని నిజం చేయాల్సిన బాధ్యత నేటితరంపై ఎంతైనా ఉంది.రచయిత చందులూరి బ్రహ్మయ్య బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.