📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMulugu5వ బెటాలియన్ అభివృద్ధికి మంత్రి సీతక్క హామీ .అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

5వ బెటాలియన్ అభివృద్ధికి మంత్రి సీతక్క హామీ .అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

📰 Generate e-Paper Clip

  • 5వ బెటాలియన్ అభివృద్ధికి మంత్రి సీతక్క హామీ
    .అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
    ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
    ములుగు జిల్లా, చల్వాయి 5వ తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు.
    ఈ కార్యక్రమంలో 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణితో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
    అనంతరం మంత్రి సీతక్క SDRF సిబ్బంది నిర్వహించిన ఆధునిక రెస్క్యూ పరికరాల ప్రదర్శనను వీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాల పనితీరుపై అధికారులు వివరించగా, మంత్రి ఆసక్తిగా పరిశీలించి సిబ్బందిని అభినందించారు.
    తదుపరి బెటాలియన్ సిబ్బందితో ఆత్మీయంగా సమావేశమైన సీతక్క వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమం, బెటాలియన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
    5వ బెటాలియన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా అని మంత్రి స్పష్టం చేశారు.
    బెటాలియన్ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కమాండెంట్ సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు.

*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.