పోరుమామిళ్ల,జులై 28 ప్రజావాణి వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని పోరుమామిళ్ల–రంగసముద్రం రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని,సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు,క్వాలిటీ కంట్రోల్ అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.కాంక్రీట్ రోడ్డు నిర్మాణంలో సాంకేతిక నిబంధనల ప్రకారం తగిన కాలం పాటు క్యూరింగ్ చేయాల్సి ఉండగా,కొన్ని ప్రాంతాల్లో కేవలం పైపైగా నీరు చల్లి పనులు ముగిస్తున్నారని వారు పేర్కొన్నారు. అలాగే పోరుమామిళ్ల బస్టాండ్ సమీపంలోని డ్రైనేజీ క్యూరింగ్ కూడా నాసిరకంగా జరుగుతోందని,అదేవిదంగా పంట కాలువ కూడా నాసికరంగా సరైన క్యూరింగ్ లేకుండా చేశారని,వర్షాకాలంలో కాలువలు కుంగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల పన్నుల సొమ్ముతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి,నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, పర్యవేక్షణలో విఫలమైన సంబంధిత అధికారులపై ప్రభుత్వం కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే సమగ్ర సాంకేతిక విచారణకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైతే స్వతంత్ర నాణ్యతా తనిఖీ నిర్వహించి,నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు కోరారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ఫణి రావు,ఆఫీస్ సెక్రటరీ ప్రవీణ్ బాబు ప్రెస్ సెక్రటరీ సాగర్ మాట్లాడుతూ ప్రజా ధనంతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో పారదర్శకత, నాణ్యత తప్పనిసరిగా ఉండాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడేలా అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ?.. ఆర్ అండ్ బి అధికారులపై తీవ్ర విమర్శలు వారిపై చర్యలు తీసుకోవాలి: ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్
RELATED ARTICLES




