📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonప్రజావాణి అర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి

ప్రజావాణి అర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

*ప్రజావాణి అర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి*

*ప్రజావాణిలో (481) దరఖాస్తుల స్వీకరణ*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి):
జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా ప‌రిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా ప‌రిష్క‌రించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే స్వీక‌రించిన ద‌ర‌ఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌తను ఇవ్వాల‌న్నారు.

అదే విధంగా పెండింగ్ లో గల ఆర్జీల పరిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలని అధికారుల‌కు సూచించారు.

ఈ ప్రజావాణిలో మొత్తం *(481)* దరఖాస్తులను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు.

*ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి..*

రఘునాథపల్లి మండలం, గబ్బెట గ్రామానికి చెందిన సీహెచ్. అఖిల, ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేయ‌గ‌ల‌ర‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ అర్జీని స‌మ‌ర్పించారు.

పాలకుర్తి మండలం, ఈరవెన్ను గ్రామానికి చెందిన అనుముల కొంరయ్య, తన ఇంటికి వెళ్లే రహదారి బాటను కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు.

ఘనపూర్ (స్టేషన్) మండలం, ఛాగల్ గ్రామానికి చెందిన సత్తు పోషాలు, తన ఒక ఎకరం 17 గుంటల భూమి, 2018 నుంచి తన పేరుపై రావడం లేదని, దానిని రద్దు చేసి, నా భూమి పట్టా ఇప్పించగలరని విన్న‌విస్తూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించారు.

దేవరుప్పుల మండలం, సీతాపురం గ్రామానికి చెందిన డీ. సత్తచీ, తన భూమిని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేయ‌గ‌ర‌ల‌ని కోరుతూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించ‌నైన‌ది.

నర్మెట్ట మండలం, కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన కలకుంట్ల అయిలమ్మ, తనకు స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించారు.
ఈ ప్ర‌జావాణిలో జెడ్పీ సీఈవో బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.