లోక్యతండలో ఘనంగా మహా అన్నదానం
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 21
కూసుమంచి మండలం లోక్యతండలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుని ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వడ్త్యా లోక్య, వడ్త్యా నామ, వడ్త్యా రవీందర్, లావురి కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వడ్త్యా వెంకటేష్, షేట్ రామ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమానికి గ్రామస్థులు, మహిళలు, యువతతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన మహా అన్నదాన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను గ్రామస్థులు అభినందించారు.
లోక్యతండలో ఘనంగా మహా అన్నదానం
RELATED ARTICLES

