📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పలాస జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్న కాశీబుగ్గ పోలీస్

పలాస జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్న కాశీబుగ్గ పోలీస్

📰 Generate e-Paper Clip

పలాస జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్న కాశీబుగ్గ పోలీస్

జంట పట్టణాల్లో నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టిన కాశీబుగ్గ డీఎస్పీ భవానీ

డ్రోన్లు సర్వే ద్వారా బహిరంగ మద్యము సేవించే వారిపై చర్యలు

గంజాయి , పేకాట అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా

పలాస ప్రజావాణి ప్రతినిధి

శ్రీకాకుళం జిల్లాలోని పలాస మున్సిపాలిటీ పరిధిలోని జంట పట్టణాల్లో నేరాలను అరికట్టేందుకు డ్రోన్లు సర్వే చేస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపారు.
డ్రోన్లలో ఉపయోగించే కెమెరాలు మరియు లెన్స్‌ల ముఖ్యమైన ఫీచర్లు, వాటి ఉపయోగాలు కింద ఇలా ఉన్నాయి.
డ్రోన్ కెమెరా లెన్స్ రకాలు ఇలా ఉన్నాయి.
హై-డెఫినిషన్ ఆప్టికల్ జూమ్ లెన్స్ చాలా ఎత్తు నుంచి కూడా భూమిపై ఉన్న చిన్న వస్తువులను లేదా వ్యక్తులను ఎంతో స్పష్టంగా జూమ్ చూడటానికి ఈ లెన్స్ సహాయపడుతుందనీ తెలిసింది.
థర్మల్ ఇమేజింగ్ ఇవి రాత్రి వేళల్లో లేదా దట్టమైన చెట్ల పొదల్లో దాక్కున్న నిందితులను, వారి శరీర వేడి ఆధారంగా సులభంగా గుర్తిస్తాయి.
వైడ్-యాంగిల్ లైసెన్స్ భారీ బహిరంగ సభలు, నిరసనలు లేదా ఉత్సవాలు జరిగినప్పుడు పెద్ద మొత్తంలో గుమికూడిన జనసమూహాన్ని , క్రౌడ్ మానిటోరింగ్ ఒకే ఫ్రేమ్‌లో పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఫేషియల్ రికగ్నిషన్ (మొహాలను గుర్తించే సాంకేతికత): ఇక్కడ పోలీసులు వాడుతున్నారు. స్మార్ట్ డ్రోన్లలో ప్రాజెక్ట్) ఈ లెన్స్ ద్వారా రౌడీ షీటర్లు, పాత నేరస్థుల మొహాలను పాత డేటాబేస్‌తో పోల్చి వెంటనే గుర్తిస్తారు. పోలీస్ డ్రోన్ సర్వే ముఖ్య ఉపయోగాలు
రాత్రి వేళల్లో నిఘా సాధారణ పెట్రోలింగ్ వాహనాలు వెళ్లలేని ఇరుకైన గల్లీలు, నిర్మానుష్య ప్రాంతాలు, పార్కులు మరియు చెరువుల వద్ద నిఘా ఉంచి గంజాయి విక్రయాలు, తాగుడు వంటి చట్టవ్యతిరేక పనులను పట్టుకుంటారు. అలాగే నగరాల్లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లను గుర్తించి, క్లియర్ చేయడానికి మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారికి వీడియో ఆధారాలతో చలాన్లు పంపడానికి వాడుతున్నారు.
నేర స్థల పరిశోధనక్రైమ్ సీన్ దెబ్బతినకుండా ఆ ప్రాంతాన్ని 3D మ్యాపింగ్ చేయడానికి మరియు ఫోరెన్సిక్ ఆధారాల కోసం పైనుంచి ఫోటోలు తీయడానికి ఈ డ్రోన్ సర్వే ఉపయోగపడుతుంది.
నిందితుల గాలింపు ఏదైనా నేరం చేసి తప్పించుకుపోయే దొంగలను పట్టుకొనేందుకు వీలు ఉందని తెలిపారు..
డ్రోన్లు సర్వే ప్రకారం పలాస జంట పట్టణాల్లో నేరాలు అదుపులోకి తెచ్చేందుకు డ్రోన్లు ఉపయోగము ఉందనీ చెప్పక తప్పదు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.