📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మొన్న రైతు..నేడు విద్యార్థి.చివరికి ఉద్యమమే గెలుపు - సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఉద్ఘటన

మొన్న రైతు..నేడు విద్యార్థి.చివరికి ఉద్యమమే గెలుపు – సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఉద్ఘటన

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల(జులై 25 ప్రజావాణి)నీట్ పరీక్షల పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం నెగ్గిందని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అన్నారు.ఈ సందర్భంగా వారు పోరుమామిళ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఉక్కుపిడికిలి లాంటి ఉద్యమాల తాకిడికి తలొగ్గి, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు.ఎంతటి నియంత ప్రభుత్వాలైనా ప్రజాపోరాటాల ముందర మోకరిల్లక తప్పదని మరోసారి నిరూపితమైందన్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే ఊరుకునేది లేదు.విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కుదవపెట్టే కుట్రలను తిప్పికొడతామని భవిష్యత్తులో కూడా విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై సిపిఐ పోరాటం ఆగదని తెలిపారు. మొన్న రైతు ఉద్యమం,నేడు విద్యార్థుల ఉద్యమానికి, రేపు కార్మిక సంఘాల ఉద్యమాలకు తలగ్గాల్సిందే అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular