📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాల మహానాడు ఆధ్వర్యంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు

మాల మహానాడు ఆధ్వర్యంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రొద్దుటూరు (జూలై 25 ప్రజావాణి) మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షులు జేష్ఠది భాస్కర్ ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు జేష్ఠది భాస్కర్, మేకల వెంకటన్న మాట్లాడుతూ నాగమల్లేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకురాలని, దళిత హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.అనంతరం కేక్ కట్ చేసి నాగమల్లేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆమె మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జేష్ఠది మధు,ప్రొద్దుటూరు పట్టణ యువజన అధ్యక్షులు జాస్వర్, ప్రొద్దుటూరు తాలూకా యువజన అధ్యక్షులు మోపురి పుష్పరాజ్, ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి ప్రసాద్‌తో పాటు మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ విషయాన్ని మాల మహానాడు జి. చెన్నయ్య వర్గం కడప జిల్లా అధ్యక్షులు జేష్ఠది భాస్కర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.