📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య

నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా జూలై 24 ప్రజావాణి వెంకటగిరి జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ..కార్యకర్తలకు నూతన వేదిక నేదురుమల్లి  పార్టీ క్రమశిక్షణే విజయానికి సోపానం.. శ్రేణులంతా అధినేత పిలుపుకు స్పందించాలి వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్.జే.ఆర్. భవన్‌లో శుక్రవారం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నేదురుమల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ 2.0 సూపర్ యాప్’ పార్టీ ,కార్యకర్తలకు అనుసంధానం అవ్వాలనే దృష్టితో యాప్ రూపొందించబడిందన్నారు.పార్టీ నాయకత్వం నేరుగా కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోస్ట్ చేసే కంటెంట్‌ను అన్యాయంగా తొలగించడం,అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో,కార్యకర్తలకు సొంత వేదికగా ‘జగన్ 2.0 సూపర్ యాప్‘రూపొందించారాని చెప్పారు.ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త ఎలాంటి భయం లేకుండా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త పార్టీతో నిరంతరం అనుసంధానమై ఉండేందుకు ఈ యాప్ దోహదపడుతుందని,ఇది పార్టీకి చెందిన వేదిక కావడంతో ఎవరూ ఇష్టానుసారంగా కంటెంట్ తొలగించే అవకాశం ఉండదని వివరించారు.క్రమశిక్షణే విజయానికి సోపానం పార్టీ కార్యకర్తల నుంచి వివిధ హోదాల్లో ఉన్న నాయకుల వరకు అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ప్రతి నాయకుడు,కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో పార్టీ పదవులు నిర్వహిస్తున్న కొందరు అధినేత నిర్దేశించిన కార్యక్రమాలకు దూరంగా ఉండటం సరైన విధానం కాదని హితవు పలికారు.నేదురుమల్లిని కలిసిన గూడూరు సమన్వయకర్త గురవయ్య గూడూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన బూదూరు గురవయ్య శుక్రవారం వెంకటగిరిలోని ఎన్.జే.ఆర్. భవన్‌లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ,గూడూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని వైయస్సార్సీపి బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తల అందరితో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేస్తూ,వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని గురవయ్యకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular