📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

📰 Generate e-Paper Clip

కడప జూలై 24 ప్రజావాణి నీట్ పేపర్ లీకేజీ కారకులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాసంస్థల బందును కడప నగరంలో విజయవంతం చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి,రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు,రాష్ట్ర అధ్యక్షులు తగిలి రాజేంద్రప్రసాద్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ్,నాయకులు శివ,రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్,నాయకులు నాగేంద్ర.ఈ సందర్భంగా వారు బంద్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.నీట్ పేపర్ లీకేజీ కి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని గత నెల రోజులుగా చేస్తున్న విద్యార్థుల ఉద్యమానికి పిలిచి సంప్రదింపులు చేయకుండా శాంతియుతంగా ఉద్యమం చేపడుతున్న లక్షలాదిమంది విద్యార్థులను విచక్షణారహితంగా లాఠీ చార్జీలు చేయడం,అమ్మాయిలని అని చూడకుండా దారుణంగా కొట్టడం ప్రజాస్వామ్యంలో ఇది ఒక దురదృష్టకరమని వారన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయంలో వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని మండిపడ్డారు.ఒక్క నీట్ పేపర్ వరసగా లీకేజీ అవుతుందని అన్నారు.అసమర్థత స్పష్టంగా కనపడుతున్నది ఇది బీజేపీ జేబు సంస్థలాగా పని చేస్తుందని అన్నారు.ఎన్నో వేల,లక్షల మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కల ను నిరాశ కలిగించేలా చేశారన్నారు. పేపర్ లీకేజీ వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవన్ని కేంద్ర ప్రభుత్వ హత్యలే అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయాలని నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గత 25రోజులుగా పర్యావరణవేత్త సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకుండా వారిని అరెస్ట్ చెయ్యడం దారుణం అని అన్నారు. వారికి మద్దతుగా ప్రజా లోకమంతా ఉందని ప్రజాస్వామ్యంలో హక్కులను హరించేందుకు ఎవరికీ అర్హత లేదని వారు అన్నారు.ఇలా అరెస్ట్ చేస్తే ప్రజా స్వామ్యం లో హక్కులు అడిగేందుకు స్వీచ్చ కోల్పోతామణి అన్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ని తక్షణమే రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బందును కడప జిల్లాలో కూడా విజయవంతం జరిగిందని వారన్నారు.ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మెంబెర్ చారీ,ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అఖిలేష్,పి ఎస్ యు జిల్లా అధ్యక్షులు గోపి,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్ మల్లికార్జున రెడ్డి,నిఖిల్,అభిరామ్,పండు,ప్రవీణ్,హరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.