📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గూడెం గ్రామంలో SIR పై అవగాహన కార్యక్రమం – జూలై 15లోపు వివరాలు నమోదు చేసుకోవాలని...

గూడెం గ్రామంలో SIR పై అవగాహన కార్యక్రమం – జూలై 15లోపు వివరాలు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచన

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 8 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద SIR (ఓటరు సవరణ కార్యక్రమం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీకాంత్ హాజరై గ్రామస్తులకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీలోపు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసి, అవసరమైన SIR ఫారాలను సంబంధిత బీఎల్ఓలకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. గడువులోగా నమోదు చేయకపోతే ఓటు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు ఉండేలా చేయడమే కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు.అనంతరం గూడెం గ్రామపంచాయతీని తొలిసారిగా సందర్శించిన తహసీల్దార్ శ్రీకాంత్‌ను సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జీపీఓ నిరీష్, గ్రామ కార్యదర్శి యాదగిరి, బీఎల్ఓ సరోజన, సీఏ సుష్మ, ఎమ్మార్వో కార్యాలయ అధికారి రమేశ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.