గూడెం గ్రామంలో SIR పై అవగాహన కార్యక్రమం – జూలై 15లోపు వివరాలు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచన

బెజ్జంకి, జూలై 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద SIR (ఓటరు సవరణ కార్యక్రమం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీకాంత్ హాజరై గ్రామస్తులకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీలోపు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసి, అవసరమైన SIR ఫారాలను సంబంధిత బీఎల్ఓలకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. గడువులోగా...