📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

📰 Generate e-Paper Clip

సామాన్యుడి చేతుల మీదుగా ఏబీవీపీ జెండా ఆవిష్కరణ.

పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 09) ఘనంగా జరిగాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోరుమామిళ్లలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక వివేకానంద భవన్ వద్ద ఏబీవీపీ నాయకులు అభిలాష్ భిన్నమైన రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం దక్కాలనే ఉద్దేశంతో,నిత్యం కష్టపడి పనిచేసే ఒక వృత్తి కళాకారుడిని (చెప్పులు కుట్టే వ్యక్తి) గౌరవపూర్వకంగా పిలిపించి,ఆయన చేతుల మీదుగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంది.​అనంతరం పోరుమామిళ్లలోని సాయిరాం జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాల హెచ్ఎం బాలరంగయ్య మాట్లాడుతూ.విద్యార్థి ఉద్యమాలలో ఏబీవీపీ పాత్ర,దేశ నిర్మాణంలో యువత బాధ్యత, విద్యా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూనే,సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన అన్నారు. అనంతరం ఏబీవీపీ నాయకులు అభిలాష్ మాట్లాడుతూ.స్వామి వివేకానంద చెప్పిన ‘విద్య జీవితం కోసం జీవితం దేశం కోసం’ అనే మాటలే బాటగా చేసుకొని ఏబీవీపీ 77 ఏళ్లుగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఐదు మంది విద్యార్థులతో ప్రారంభించిన ఏబీవీపీ నేడు 70 లక్షలకు పైగా సభ్యత్వం కలిగిన భారతదేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అన్నారు.విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా తనదైన శైలిలో ఏబీవీపీ నిర్మాణాత్మక ఉద్యమాలు చేస్తుందన్నారు. ఇటువంటి ఏబీవీపీ ప్రారంభించబడిన జులై 9 వ తేదీని జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకోవడం నిజంగా పండుగరోజని ఆయన అన్నారు.​ఈ కార్యక్రమంలో రమణాచారి,చంద్ర,హర్ష,కార్తీక్,చందు మరియు సాయిరాం జూనియర్ కళాశాల విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular