సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం
-సర్ ప్రక్రియపై అవగాహన జాగ్రత్తలపై చర్చ.
రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూలై 04
సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,సుందిల్ల క్లస్టర్ ఇంచార్జి ఈగ ప్రశాంత్ ల అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు సుందిల్ల గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు,గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ జనగామ సదానందం,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మెన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్,దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుడు రేకుంట్ల రవి,వార్డు సభ్యుడు రామగిరి స్టాలిన్,తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పేగ నాగేందర్,మాజీ సర్పంచ్ మర్కా స్వామి,మాజీ ఉపసర్పంచ్ తాటి సమ్మయ్య గౌడ్,గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరకొప్పుల తిరుపతి గౌడ్,లక్ష్మణ్ గౌడ్, మణికంఠ గౌడ్,మారం నారాయణ,గడ్డం నాగరాజు,పల్లె చిరంజీవి,కార్యకర్తలు అభిమానులు పాల్గొని ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
అలాగే గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.సర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు.





