వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
మన సమగ్ర ప్రజావాణి జూన్ 29 (సాయిపేట్ ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఆలూరి సంతోష్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ సామల మీనా చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతుల పనులు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.
వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
RELATED ARTICLES




