📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ &;యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా...

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ &;యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కవలకుంట్ల మధు బాబు నియామకం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,జూన్ 23ప్రజావాణి సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉంటూ,బలమైన రాజకీయ మరియు సామాజిక నేపథ్యం కలిగిన ప్రముఖ నాయకులు కవలకుంట్ల మధు బాబుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సమాజానికి అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తిస్తూ ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ & యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా’ (National Human Rights Anti Corruption & Anti Crime Bureau of India) సంస్థకు జాతీయ స్థాయి జాయింట్ సెక్రటరీ (Joint Secretary for National) గా నియమిస్తూ సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎస్.జ్యోతిస్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.కవలకుంట్ల మధు బాబు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా,నిరంతరం అనేక సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ,వారితో స్వయంగా కలిసి కూర్చుని సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం ఆయన మానవత్వానికి నిదర్శనం.అలాగే వృద్ధుల సంరక్షణే ధ్యేయంగా వారికి ఉచితంగా దుస్తులు పంపిణీ చేయడం,అనాథాశ్రమాల్లోని పిల్లలకు ఆహారంతో పాటు స్వీట్లు పంచుతూ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం నిర్వహిస్తున్నారు.ఇలాంటి సేవాతత్పరతను పరిగణనలోకి తీసుకునే ఈ కీలక పదవికి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా ఈ నియామకంపై కవలకుంట్ల మధు బాబు హర్షం వ్యక్తం చేస్తూ,తనపై నమ్మకంతో జాతీయ స్థాయి బాధ్యతలను అప్పగించిన సంస్థ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.తనకున్న రాజకీయ,సామాజిక అనుభవంతో సమాజంలో అవినీతి నిర్మూలనకు,మానవ హక్కుల రక్షణకు గట్టిగా కృషి చేస్తానని చెప్పారు.భవిష్యత్తులో కూడా అనాథలు,వృద్ధులు,మరియు వెనుకబడిన వర్గాల హక్కుల రక్షణ కోసం,వారి శ్రేయస్సు కోసం సంస్థ పరంగా మరిన్ని సేవా కార్యక్రమాలు విరివిగా చేపడతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.మధు బాబు నియామకం పట్ల పలువురు రాజకీయ విశ్లేషకులు,సామాజిక కార్యకర్తలు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.