
పోరుమామిళ్ల జూన్ 23ప్రజావాణి కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నారోజు రమణాచారిని కడప జిల్లా బిజెపి అధికార ప్రతినిధి గా నియమించ,నియామక పత్రాన్ని అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అందజేశారు..నారోజు రమణాచారి మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతనిచ్చిన జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత 25 సంవత్సరాలుగా పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తించి సేవలందించినందుకు నన్ను గుర్తించి నాకు ఈ బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్‌కి,రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతతో పార్టీ వానిని కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరే విధంగా ప్రయత్నిస్తాను అన్నారు.
అదేవిధంగా నాకు సహకరించిన పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నాగేంద్రకి,బద్వేల్ నియోజకవర్గ నాతోటి బీజేపీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేసారు.ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి సర్,రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ బాల కృష్ణ యాదవ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మి నారాయణ రెడ్డి ,కిసాన్ మోర్చా నాయకుడు & అసెంబ్లీ కో కన్వీనర్ పల్లంశెట్టి పండరి,మండల్ జనరల్ సెక్రటరీ దుల్ల శ్రీనివాస్ రెడ్డి,తమ్మిశెట్టి రమణ,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు .




