📄 ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అధికారుల కన్ను సన్నుల్లో ఇష్టానుసారంగా డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్.

అధికారుల కన్ను సన్నుల్లో ఇష్టానుసారంగా డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్.

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూన్ 24). పోరుమామిళ్ల మండలం. రంగసముద్రం పంచాయతీలోని సుందరయ్య కాలనీలో అధికారుల కనుసన్నల్లో సంబంధించిన కాంట్రాక్టర్ డ్రైనేజీ పనులను ఇష్టానుసారంగా చేస్తున్నారు. సుందరయ్య కాలనీలోని ఒక వీధికి డ్రైనేజీ కాలువ లేకపోవడంతో ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నాలుగు లక్షలకు ప్రతిపాదనలు పెట్టారని ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ ఒబయ వెల్లడించారు. ఈ నిధులతో ప్రతిపాదనలో ఉన్న డ్రైనేజీ పనులను చేయవలసి ఉంది.కానీ సంబంధించిన కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా జెసిబి తో ఏడు అడుగులు లోతు తో భారీగా వెడల్పుతో తీస్తున్నాడు. కాంట్రాక్టర్ లబ్ధి కోసం వారి ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. ఈ డ్రైనేజీతో పక్కనే నివాసం ఉన్న ఇల్లులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ లోతుగా తీయడంతో అందులో పిల్లలు పడతారేమోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు లేదు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular