📄 ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తోటపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ-- ముగ్గురికి స్వల్ప గాయాలు

తోటపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ– ముగ్గురికి స్వల్ప గాయాలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి జూన్ 24 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామ స్టేజ్ సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికుల వివరాల ప్రకారం, TS 07 FC 6040 నంబర్ గల మారుతి ఆల్టో కారులో హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ నంగునూరు సంతోష్, పుల్లయ్య, ఆయన భార్య, ఓ బాలుడు కరీంనగర్‌లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తోటపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే టోల్ ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్ సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular