
నంద్యాల జిల్లా.జూన్ 22ప్రజావాణి విద్యా వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల విచలవిడి దోపిడీని అరికట్టాలి-బేతంచెర్ల మండల స్థాయి అధికారులకు పిర్యాదు చేసిన ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ కుమార్ ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బేతంచెర్ల మండల వ్యాప్తంగా ప్రవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నప్పటికీ బేతంచర్ల మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలుG.O.NO:1 విద్య హక్కు చట్టం (ఆర్ టి ఈ )ను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ప్రవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో అక్షరాలతో లక్షల వ్యాపారం జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం చాలా బాధాకరమని వారు అన్నారు.అడ్మిషన్ మొదలుకొని బుక్స్,యూనిఫాం స్టేషనరీ,వ్యాన్ ఫీజులు ఇలా వివిధ రకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ పెట్టి విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ప్రవేట్,కార్పోరేట్ విద్యా సంస్థల పైన మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ మండల నాయకులు ఎల్లకృష్ణ, ఖదీర్,శివ,గౌరీ ఉదయ్,మధు శేఖర్,సాయి,విష్ణు,శేఖర్,తరుణ్,అబ్దుల్లా,మల్లికార్జున,దుర్గాప్రసాద్,విష్ణువర్ధన్.తదితరులు పాల్గొన్నారు.

