📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రాజెక్టుల రూపుశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరాయ జయంతి వేడుకలు: బద్వేలులో ఘనంగా నిర్వహణ

ప్రాజెక్టుల రూపుశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరాయ జయంతి వేడుకలు: బద్వేలులో ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

బద్వేలు:సెప్టెంబర్ 15 ప్రజావాణి స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘ సలహాదారు ధనుంజయ రావు ఆధ్వర్యంలో మహోన్నత ఇంజనీర్,భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులందరూ కలిసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి,చేతులెత్తి మొక్కి ఘన నివాళులర్పించారు.
ఆయన సేవలు మరువలేనివి:
ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సలహాదారు ధనుంజయ రావు మాట్లాడుతూ,ఆధునిక భారతదేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన సేవలను కొనియాడారు. భగవంతుడు మనకు నీటిని ప్రసాదిస్తే,ఆ నీటిని ప్రజలకు ఉపయోగపడేలా ఎక్కడికి మళ్లించాలి,ఎలా నిల్వ చేయాలనేది ఒక ఇంజనీర్ ఆలోచనకే సాధ్యమని ఆయన చెప్పారు.దేశంలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మహానుభావుడు విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకునేలా ఆయన చేసిన పనుల వల్లే, ఆయన పుట్టినరోజును మనం ‘ఇంజనీర్స్ డే’ (ఇంజనీర్ల దినోత్సవం)గా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.1861 సెప్టెంబర్ 15న జన్మించిన విశ్వేశ్వరయ్య గారు, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి కర్ణాటకలో స్థిరపడ్డారని చెప్పారు. అక్కడ ఎన్నో నదులపై ప్రాజెక్టులు కట్టి నీటి పారుదల రంగాన్ని మార్చేశారని కొనియాడారు.ఆయన దేశానికి చేసిన గొప్ప సేవలను గుర్తించే భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారమైన’భారతరత్న’అవార్డును ఇచ్చి గౌరవించిందని ధనుంజయ రావు వివరించారు.
ఘన సన్మానం:ఈ వేడుకల్లో భాగంగా,స్వయంగా ఇంజనీరుగా సేవలందించి గుర్తింపు పొందిన ధనుంజయ రావు గారిని విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఆయన చేసిన సేవలను అభినందించారు.పాల్గొన్న ప్రముఖులు:ఈ నివాళి కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, అసోసియేట్ సభ్యులు గంజిగుంట పుల్లయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్ పాల్గొన్నారు.అలాగే కార్యవర్గ సభ్యులు ముండ్లపాటి పిచ్చయ్య, వెంకటేశ్వర్లు,ప్రసాద్,రామసుబ్బయ్య,లక్ష్మిరెడ్డి,గ్రేసియస్, వాకారామయ్య,సుబ్బరాయుడు,చిన్న రాయుడు,శ్రీరాములు,శ్రీనివాసులు,తిమ్మయ్య,చెన్నారెడ్డి,ఇస్మాయిల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.