📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం.నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.

ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం.నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.

📰 Generate e-Paper Clip

కాశి నాయన.జూన్ 22ప్రజావాణి మండల పరిధిలోని మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజు 30 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో కీ.శే.పసుపులేటి వెంకటమ్మ (సంటెమ్మ) సేవా సంస్థ నిర్వాహకులుజి.వీ.రమణ (అమెరికా) వారు మా పాఠశాలలోని 30 మంది విద్యార్థిని,విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించడం జరిగింది.ఉచిత నోట్ పుస్తకాలు అందించుటలో మాకు సహకరించిన సంస్థ సహాయ కార్యనిర్వాహకులు  శ్రీ జి.శ్రీనివాసులు,వరి సతీమణి శ్రీమతి సుహాసిని తరఫున మా పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిద్దెల పంచాయతీ సెక్రటరీ పాండురంగ చారి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ ప్రతినిధులైన జి వెంకటరమణ ని వారు కొనియాడారు.విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు.అనంతరం ముఖ్య అతిథి పంచాయతీ సెక్రటరీ మరియు తల్లిదండ్రులు విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీవీ చంద్రశేఖర ఆచారి,ఉపాధ్యాయురాలు కళావతి,పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.