
పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 18) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజావాణి పత్రిక వార్తా కథనానికి అద్భుత స్పందన లభించింది. నిన్నటి కథనంలో ప్రస్తావించిన సమస్యపై అధికారులు,నిర్వాహకులు తక్షణమే స్పందించి,ఈ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేశారు.
ఈ సానుకూల మార్పుపై ప్రత్యేక సమస్యకు శాశ్వత పరిష్కారం నిన్నటి వరకు మురికి కూపంగా మారి,నీరు నిల్వ ఉండి,పిచ్చి మొక్కలతో దర్శనమిచ్చిన అన్నం ప్లేట్లు కడిగే ప్రదేశం ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది.తక్షణమే రంగంలోకి ‘ప్రజావాణి’ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన నిర్వాహకులు తక్షణమే క్లీనింగ్ సిబ్బందిని రంగంలోకి దించారు.యుద్ధప్రాతిపదికన పనులు నిలిచిపోయిన మురికి నీటిని తొలగించి,పెరిగిన చెత్తాచెదారం,పిచ్చి మొక్కలను పూర్తిగా శుభ్రం చేశారు.పరిశుభ్ర వాతావరణం నేలను,గోడలను,టైల్స్‌ను బ్లీచింగ్ పౌడర్ మరియు క్లీనర్లతో కడిగి,ఇప్పుడు అత్యంత పరిశుభ్రంగా మార్చారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు: సమస్యను వెలుగులోకి తెచ్చిన‘ప్రజావాణి’ పత్రికకు,అలాగే వార్తకు సానుకూలంగా స్పందించి తక్షణమే శుభ్రం చేయించిన నిర్వాహకులకు ప్రజలు మరియు సందర్శకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.నిరంతరం ఇదే రకమైన పరిశుభ్రతను పాటించాలని వారు కోరుతున్నారు.




