ప్రజావాణి’ వార్తకు తక్షణ స్పందన: స్వచ్ఛంగా మారిన అన్నం ప్లేట్లు కడిగే ప్రదేశం

పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 18) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజావాణి పత్రిక వార్తా కథనానికి అద్భుత స్పందన లభించింది. నిన్నటి కథనంలో ప్రస్తావించిన సమస్యపై అధికారులు,నిర్వాహకులు తక్షణమే స్పందించి,ఈ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. ఈ సానుకూల మార్పుపై ప్రత్యేక సమస్యకు శాశ్వత పరిష్కారం నిన్నటి వరకు మురికి కూపంగా మారి,నీరు నిల్వ ఉండి,పిచ్చి మొక్కలతో దర్శనమిచ్చిన అన్నం ప్లేట్లు కడిగే ప్రదేశం ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది.తక్షణమే రంగంలోకి ‘ప్రజావాణి’ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన నిర్వాహకులు తక్షణమే క్లీనింగ్ సిబ్బందిని...