వైఎస్ఆర్ కడప జిల్లా (ప్రజావాణి జూన్ 18) బి.కోడూరు మండలం పరిధిలోని ఐత్రంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) లో నెలకొన్న అధ్వాన పరిస్థితులు,ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ,ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తుంటే.కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ వ్యవస్థకే తీరని కళంకం వస్తోంది.అక్కడి ప్రధానోపాధ్యాయుడు (హెడ్‌మాస్టర్) సుబ్బారావు నిర్లక్ష్య వైఖరిపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్థానిక పాఠశాల నిర్వహణ గాలికొదిలేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బోర్డుపై పేరే లేదు.. అడ్మిషన్లపై అనాసక్తత!
ఐత్రంపేట హైస్కూల్ దుస్థితి ఎలా ఉందంటే.కనీసం ఎంట్రెన్స్ బోర్డు పైన పాఠశాల పేరు కూడా లేకపోవడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇది పాఠశాల కనీస నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై అడ్మిషన్ల కోసం పాఠశాలకు వస్తున్న విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో హెడ్‌మాస్టర్ సుబ్బారావు కనీసం మర్యాదగా కూడా మాట్లాడటం లేదని,వారి సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
పుస్తకాల పంపిణీలో గందరగోళం.పెరిగిన టీసీల సంఖ్య!
పాఠశాలలో విద్యార్థులకు సకాలంలో,పద్ధతి ప్రకారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంలో తీవ్ర గందరగోళం నెలకొంది.దీంతో పుస్తకాల కోసం విద్యార్థులు,తల్లిదండ్రులు రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటువంటి లోపభూయిష్టమైన నిర్వహణ,పాఠశాలలో సరైన వాతావరణం లేకపోవడం వల్లే విసిగిపోయిన దాదాపు 8 మంది విద్యార్థులు ఇప్పటికే ఈ స్కూల్ నుండి టీసీలు తీసుకుని ఇతర పాఠశాలలకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.ఒక ప్రభుత్వ పాఠశాల నుండి ఈ స్థాయిలో విద్యార్థులు వలస వెళ్లడం విద్యా వ్యవస్థ పతనానికి అద్దం పడుతోంది.
విద్యార్థినులతో ఉపాధ్యాయురాలి అసభ్య ప్రవర్తన?
ఈ వివాదాలు ఇలా ఉంటే,పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోషల్ (సాంఘిక శాస్త్రం) ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో అత్యంత అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడంపై విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా.క్షేత్రస్థాయిలో కొందరి బద్ధకం,బాధ్యతారాహిత్యం వల్ల విద్యా వ్యవస్థ పరువు బజారున పడుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు.”మా పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకునేది లేదు” అని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.ఈ ఉదంతంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,ఐత్రంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పూర్తి స్థాయి విచారణ జరపాలని.నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌మాస్టర్‌తో పాటు,విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు
పేరు లేని పాఠశాల..పరువు పోతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ..! ఐత్రంపేట జడ్పీహెచ్ఎస్‌లో నిర్లక్ష్యం పరాకాష్ట
RELATED ARTICLES




