📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి:...

పోరుమామిళ్ల ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: పోరుమామిళ్ల తహసిల్దార్ విజయ్‌కుమార్ పిలుపు

📰 Generate e-Paper Clip

బద్వేల్ (ప్రజావాణి జూన్ 11) పోరుమామిళ్ల ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: పోరుమామిళ్ల తహసిల్దార్ విజయ్‌కుమార్ పోరుమామిళ్ల, జూన్ 11:పోరుమామిళ్ల పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న “ఒక నెల – ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని మండల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పోరుమామిళ్ల మండల తహసిల్దార్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్‌లతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని తహసిల్దార్ ఆదేశించారు. విధులకు హాజరుకాని అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పోరుమామిళ్ల మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను స్వచ్ఛందంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తహసిల్దార్ విజయ్‌కుమార్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular