సిగాచీ బాధితులకు పూర్తి న్యాయం చేయాలి –ఆదర్శ రెడ్డి
*జూన్ 30న హరీష్ రావు రాక సందర్భంగా సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ
పటాన్చెరు, జూన్ 27(ప్రజావాణి) :సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 30న మాజీ మంత్రి హరీష్ రావు పటాన్చెరులో పాల్గొననున్న సంస్మరణ సభ పోస్టర్ను నేడు పాశమైలారంలో బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిగాచీ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయినా ప్రభుత్వం ప్రకటించిన రూ.1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు పూర్తిగా అందలేదని ఆరోపించారు. వెంటనే పూర్తి పరిహారం చెల్లించి, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూన్ 30న హరీష్ రావు బాధిత కుటుంబాలతో కలిసి సంస్మరణ సభలో పాల్గొని సంఘీభావం ప్రకటిస్తారని తెలిపారు. బాధిత కుటుంబాలు, కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్
అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్వీ నాయకుడు మేరాజ్ ఖాన్, ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాణిక్ యాదవ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



