📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే...

రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రాయచోటి(ప్రజావాణి జూన్ 27) వైఎస్సార్‌సీపీ కార్యాలయం శనివారం పార్టీ శ్రేణులతో కళకళలాడింది. ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి విచ్చేసిన ప్రజలు,కార్యకర్తలు,నాయకులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంపీ మిథున్ రెడ్డి పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.స్థానిక సమస్యలు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై నాయకులు,కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు,అభిమానులు ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ సమస్యలను,అభిప్రాయాలను వివరించారు.ఈ కార్యక్రమంతో పార్టీ కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.సంబేపల్లె గుహేశ్వరీ సమేత పసుపతినాధ విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఎంపీ మిథున్ రెడ్డి కి ఆహ్వానం ఆందచేత.జూలై1,2,3 వ తేదీలలో జరిగే సంబేపల్లె లోని శ్రీ గుహేశ్వరీ సమేత పసుపతినాధ విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఎంపీ మిథున్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం ఆందచేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular