కాకినాడ (జూన్ 03) ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివరామ్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.ఉదయం నుంచి సోదాలు చేపట్టిన అధికారులు, ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులను గుర్తించారు. ఆయన భార్య పేరుపై కాకినాడలో సుమారు రూ.1,77,62,600 విలువైన ప్లాట్‌తో కూడిన అపార్ట్‌మెంట్, తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్‌లో రూ.1,34,23,000 విలువైన ప్లాట్, తూర్పుగోదావరి జిల్లా కోటపాడులో 1 ఎకరం 82 సెంట్ల వ్యవసాయ భూమి, అలాగే టయోటా ఫార్చ్యూనర్ కారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.శివరామ్ కుమార్ పేరుపై కాకినాడ రామారావుపేటలో రూ.1.20 కోట్ల విలువైన 375 గజాల ఖాళీ స్థలం, అలాగే మహీంద్రా కంపెనీకి చెందిన రెండు కార్లు ఉన్నట్లు వెల్లడైంది.అదనంగా, సోదాల్లో సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.27,12,800 విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు
RELATED ARTICLES



