*అధికారుల పర్యవేక్షణ పట్టింపులేనితనం*
*కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు*
టేక్మాల్ ఆగస్టు 7: (మన ప్రజావాణి) టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేసి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేది ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వేచించి భవనాలను నిర్మిస్తుంటే కొందరు గుత్తాదారులు మాత్రం కనీస నాణ్యత పరిమాణాలు లేకుండా ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు.భవన నిర్మాణంలో పనులు ఎలా జరుగుతున్నాయో అనే విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడానికి ఈ భవనమే నిదర్శనం.. అని తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 2024 లో 2.45 కోట్లతో నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు నత్త నడక విధంగా కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగ పనులు చేస్తున్నాడని ప్రజలలో చాలా విమర్శలు ఉన్నాయి. భవన స్లాబ్ పై ఉన్న బ్రిక్కును సక్రమంగా వేయకపోవడంతో కంకర ఇనుప రాడ్లు తేలి ఉన్నాయి. నాసిరకం ఇసుక సిమెంట్ తక్కువ వాడటం వల్ల భవనం కొన్ని ఏళ్లలోనే శిథిలావస్థకు చేరే ప్రమాదం ఎంతైనా ఉంది ప్రస్తుతం స్లాబ్ వరకు పనులు పూర్తయి నిలిచిపోయాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం బోరు వేసినప్పటికీ మోటర్ బిగించిన బోరులో నీరు లేకపోవడంతో గ్రామానికి సంబంధిత వాటర్ ట్యాంక్ నుండి పైపు బిగించి అక్రమంగా నీటిని తీసుకొని నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. దీంతో గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ త్రాగునీరు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులు ప్రస్తుతం స్లాబ్ పూర్తిగా నీటి క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడంతో భవిష్యత్తులో ప్రమాదంగా మారే అవకాశం ఉంది. తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తిచేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.




