కౌకొండ గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు
నడి కూడా ప్రజావాణి ఆగస్టు 7
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లులు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఎండి కామ్రూన్ మేకల అరుణ, మేకల స్వరూప తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహారం, తల్లి-శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ ఆయమ్మ మాదారం ఎలీషా, మేకల సుగుణ మాచర్ల మనోహర కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.

అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సునీత మేడం, లావణ్య మేడం పాల్గొని తల్లిపాల వల్ల శిశువుల శారీరక, మానసిక వికాసానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. గ్రామ మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




