📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఐఏఎస్ లక్ష్యానికి దారి చూపుతున్న "నా గమ్యం ఐఏఎస్" నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ...

ఐఏఎస్ లక్ష్యానికి దారి చూపుతున్న “నా గమ్యం ఐఏఎస్” నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తున్న రచయిత నారోజు శంకరాచారి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూన్ 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన రచయిత నారోజు శంకరాచారి రచించిన “నా గమ్యం ఐఏఎస్” పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు మార్గదర్శకంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర భూమేష్ గౌడ్ కుమార్తె బుర్ర సుచితకు పుస్తకాన్ని అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తూ నారోజు శంకరాచారి విద్యా సేవలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చనే సందేశాన్ని ఈ పుస్తకం అందిస్తోందని గ్రామస్థులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఐఏఎస్ వంటి అత్యున్నత లక్ష్యాల సాధనకు ప్రేరణనిచ్చే ఈ పుస్తకం మరింత మందికి చేరాలని కోరుతూ పలువురు నారోజు శంకరాచారిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.