ఐఏఎస్ లక్ష్యానికి దారి చూపుతున్న “నా గమ్యం ఐఏఎస్” నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తున్న రచయిత నారోజు శంకరాచారి
బెజ్జంకి, జూన్ 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన రచయిత నారోజు శంకరాచారి రచించిన "నా గమ్యం ఐఏఎస్" పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు మార్గదర్శకంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర భూమేష్ గౌడ్ కుమార్తె బుర్ర సుచితకు పుస్తకాన్ని అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆర్థికంగా వెనుకబడిన...