📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఅక్రమ కలప రవాణాపై అటవీ శాఖ నిర్లక్ష్యం

అక్రమ కలప రవాణాపై అటవీ శాఖ నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

*అక్రమ కలప రవాణాపై అటవీ శాఖ నిర్లక్ష్యం..!*

అటవీ అధికారులు పనిచేస్తున్నారా?

లేక పడుకుంటున్నారా?

*మన సమగ్ర ప్రజావాణి మే 25 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి*



సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో అక్రమ కలప రవాణా రోజురోజుకూ పెరుగుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎన్ హెచ్ 161 జోగిపేట నుండి ఏం ఎన్ ఆర్ ఇటుక బట్టీలకు ట్రాక్టర్లలో భారీగా కలపను తరలిస్తూ దొంగలు యథేచ్ఛగా సంచరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారుల మీదుగానే కలప రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అక్రమ కలప రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.