📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.అవినీతి ఊబిలో సామాన్యుడి ప్రాణాలు.కబంధ హస్తాల్లో ఒక.రైటర్..సామాజ్యం.!

ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.అవినీతి ఊబిలో సామాన్యుడి ప్రాణాలు.కబంధ హస్తాల్లో ఒక.రైటర్..సామాజ్యం.!

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇప్పుడు ఒక. అవినీతి కర్మాగారం.గా మారింది. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ జరగాలంటే లంచం ఇవ్వడం ఒక ఎత్తైతే,ఆ కార్యాలయంలో తిష్టవేసిన ఒక.డాక్యుమెంట్ రైటర్.. చెప్పిందే వేదంగా మారడం మరో ఎత్తు.ఆ రైటర్ కన్ను పడితే చాలు.సామాన్యుడి కంటికి నిద్ర కరువవుతోంది.అతని అక్రమాల వల్ల భూమిని కోల్పోయి ఆస్తిని పోగొట్టుకుని,చివరికి దిక్కుతోచక ఆత్మహత్యల బాట పడుతున్న మధ్యతరగతి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం.అవినీతి జలగలు.ప్రాణాలను తీసే పధకాలు.ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫైలు కదలాలంటే సబ్ రిజిస్ట్రార్ గారి కంటే,ఆ రైటర్.గ్రీన్ సిగ్నల్.ముఖ్యం.ఏ ఫైలులోనైనా అక్షర దోషాలు వెతికి వేధించడం లేనిపోని కొర్రీలతో రైటర్లను భయపెట్టడం ఇతని నైజం.తనతో అంటకాగని వారి ఫైళ్లను అడుగు కూడా ముందుకు పడనీయకుండా చేసే ఈ.అవినీతి చక్రవర్తి.తన కనుసన్నల్లో జరిగే అక్రమ రిజిస్ట్రేషన్లకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తాడు.దేవాదాయ భూములైనా,ఏటి పరంబోకులైనా,పేదవాడి పట్టా భూములైనా. ఇతని చేతికి చిక్కితే సర్వే నంబర్లు మారిపోతాయి,యజమానులు మారిపోతారు.ఆత్మహత్యలే సాక్ష్యంగా.ఈ అరాచక సామ్రాజ్యం.ఈ రైటర్ చేస్తున్న అక్రమాల వల్ల,తప్పుడు పత్రాలతో ఆస్తులు కాజేసిన బాధితుల రోదనలు ప్రొద్దుటూరు వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగిన సామాన్యుడికి, చివరకు.నీ భూమికి నకిలీ డాక్యుమెంట్లు తయారయ్యాయి, కోర్టుకు వెళ్ళినా నీకు దక్కదు. అని వీరు చేసే బెదిరింపులు ఆ కుటుంబాల ఉసురు తీస్తున్నాయి.ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆస్తి, రాత్రికి రాత్రే ఇతని మాయాజాలంతో అన్యపరం కావడంతో.ఆ మనోవేదన తట్టుకోలేక చాలామంది ప్రాణాలను బలి తీసుకున్న ఉదంతాలు ఇప్పటికే వెలుగు చూశాయి. వీటిని ఎవరూ చూడడం లేదా. లేక చూసీ చూడనట్లు నటిస్తున్నారా.​కోట్లాది రూపాయల సంపాదన.రక్తపు మడుగుల మీద రాజభవనాలు.కేవలం కమాలనే వైటర్ వద్ద అసిస్టెంట్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ వ్యక్తి, అతి తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించాడు.అంతస్తుల మీద అంతస్తులు కట్టి, నేడు ప్రొద్దుటూరులో చక్రం తిప్పుతున్నాడంటే,ఆ బిల్డింగ్ పునాదుల వెనుక ఎన్ని కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయో ఎవరూ ఆలోచించటం లేదు.రాజకీయ అండదండలు,అధికారులతో లోపాయికారీ ఒప్పందాలే ఇతనికి రక్షణ కవచాలుగా మారాయి.పోరాటమే ఏకైక మార్గం.అవినీతి అంధకారంలో కూరుకుపోయిన ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రైటర్ అరాచకాలపై సాక్ష్యాధారాలతో పోరాడేందుకు నేను సిద్ధమయ్యాము.చట్టం కళ్లు కప్పిన ఈ.భూతం.బాగోతాన్ని, బాధితుల ఆత్మహత్యలకు కారణమైన ఈ నేరపూరిత వ్యవస్థను ప్రజల ముంగిట ఉంచుతాం.ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, ఆ రైటర్ పై తక్షణమే విచారణ జరిపి,దోషులను కఠినంగా శిక్షించకపోతే.మరిన్ని ప్రాణాలు పోవడానికి బాధ్యత ఎవరిది.ఈ.అవినీతి కోట.కూలే వరకు,సామాన్యుడికి న్యాయం జరిగే వరకు నా కలం ఆగదు, గళం మూగబోదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular