📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వరుకోలులో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

వరుకోలులో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

బెజ్జంకి -కోహెడ, మే 23:

సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని వరుకోలు గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు స్థానిక ప్రజాప్రతినిధులు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ దేవరాజు, గ్రామ సెక్రటరీ బాబు, ఉపసర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి హాజరై కూలీలకు మజ్జిగ అందజేశారు. వార్డు సభ్యులు బోయిని అంతమ్మ-అశోక్, బందెల అజయ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తీవ్ర ఎండల కారణంగా ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పని త్వరగా ముగించుకొని ఇళ్లకు వెళ్లాలని, ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎండి రజాక్, ఫీల్డ్ అసిస్టెంట్ పాటి అనిల్ కుమార్, కారోబార్ గోగుల రాజు, దిశ రిపోర్టర్ ఆవుల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular