వరుకోలులో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
బెజ్జంకి -కోహెడ, మే 23: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని వరుకోలు గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు స్థానిక ప్రజాప్రతినిధులు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ దేవరాజు, గ్రామ సెక్రటరీ బాబు, ఉపసర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి హాజరై కూలీలకు మజ్జిగ అందజేశారు. వార్డు సభ్యులు బోయిని అంతమ్మ-అశోక్, బందెల అజయ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు...