📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మానవత్వాన్ని చాటుకున్న కమలాపురం సీఐ మోహన్

మానవత్వాన్ని చాటుకున్న కమలాపురం సీఐ మోహన్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే21ప్రజావాణి) అలంఖాన్‌పల్లె సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను గమనించిన కమలాపురం సీఐ మోహన్ వెంటనే స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.కమలాపురం నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ప్రమాదాన్ని చూసిన సీఐ మోహన్, స్థానికుల సహాయంతో గాయపడిన వారిని ఆటోల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఆయన చూపిన చొరవ, బాధితుల పట్ల కనబరిచిన మానవీయ స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వెంటనే ఆదుకోవడం ద్వారా పోలీస్ సేవల్లో మానవత్వం ఎంత ముఖ్యమో సీఐ మోహన్ మరోసారి నిరూపించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.