మానవత్వాన్ని చాటుకున్న కమలాపురం సీఐ మోహన్
కడప జిల్లా (మే21ప్రజావాణి) అలంఖాన్‌పల్లె సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను గమనించిన కమలాపురం సీఐ మోహన్ వెంటనే స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.కమలాపురం నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ప్రమాదాన్ని చూసిన సీఐ మోహన్, స్థానికుల సహాయంతో గాయపడిన వారిని ఆటోల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఆయన చూపిన చొరవ, బాధితుల...