📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాతీయ సమైక్యతే తెలంగాణ బలం..

జాతీయ సమైక్యతే తెలంగాణ బలం..

📰 Generate e-Paper Clip

జాతీయ సమైక్యతే తెలంగాణ బలం.. ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలి

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి):

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మొలుగు ఆనంద్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సమైక్యత, సోదరభావం ప్రతి ఒక్కరిలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, ప్రజలంతా పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని మొలుగు ఆనంద్ రావు పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా స్ఫూర్తిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఐక్యత, దేశభక్తి విలువలను అందించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.