*మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకం*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రజా వాణి )మంచాల, సెప్టెంబర్ 17 : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంచాల గ్రామంలోని శ్రీ హరిహర మహా క్షేత్రంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద ప్రత్యేక అభిషేకం చేపట్టారు.
దేశం సుభిక్షంగా, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మరింత కాలం సేవలందించాలని వారు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నారెడ్డి నరసింహారెడ్డి, జక్క హరీష్, వార్డు సభ్యులు మల్గ శ్రీశైలం, రచన బాలరాజ్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, జక్క చంద్రశేఖర్, ఓరుగంటి శేఖర్ గౌడ్, ఏరుకొండ మహేష్, నరేందర్ గౌడ్, నీళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు….

