నెల్లూరు జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు కష్టపడి,తమ సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటే,ఆ పనులను తానే చేసినట్లుగా సోమిరెడ్డి బిల్లులు చేయించుకోవడం సిగ్గుచేటు రైతులు విదిల్చిన ఎంగిలి మెతుకులు తిని,సోమిరెడ్డి సంతృప్తి పడుతున్నాడు- కాయకష్టం చేసే అన్నదాతల సొమ్మును ఆశించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు ఐఏబి సమావేశంలో కాలువలు శుభ్రం చేసి నీళ్లు వదలాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది,గతంలో నీరు-చెట్టు పథకాన్ని ఏ విధంగా అయితే దోచుకోవడానికి వాడుకున్నారో,ఇప్పుడు’నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత’అనే కొత్త పేరుతో రైతులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు,పనులు చేయకుండానే బిల్లులు కాజేసేందుకు జెసిబిల దగ్గర కొబ్బరికాయలు కొట్టి హడావిడి చేస్తున్నారు జేసీబీలు పని చేయడానికి కాకుండా,కేవలం ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టే ఫోటోల కోసమే వాడుతున్నారు,ఆ తర్వాత అవి పనిచేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయికి చేరిందంటే,గంగాధర్ రెడ్డి అనే అధికారి నేరుగా ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నాడు,ఇది పత్రికల్లో ప్రముఖంగా వచ్చినప్పటికీ కేవలం సస్పెన్షన్ తప్ప ప్రభుత్వం విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అనిపిస్తుంది బహిరంగంగా లంచాలు తీసుకుంటున్న ఆధారాలు ఉన్నా,పట్టించుకోవడం లేదు లంచం తీసుకున్న అధికారిని కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు,అతనిపై కఠిన విచారణ ఎందుకు జరపడం లేదు- ఇరిగేషన్ పనులకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు- ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రతి పేజీపై సంబంధిత అధికారి సంతకం చేయాలి.కానీ,అధికారులు కేవలం కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి, లోపల ఉన్న వివరాలకు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు పొంతన లేదు- ఒకే పనికి సంబంధించి మూడు వేర్వేరు సందర్భాల్లో బిల్లులు తీసుకున్నారు కూటమి పాలనలో జరుగుతున్న అవినీతిపై మేము అన్ని ఆధారాలను సిద్ధం చేసుకున్నాం.ఏ రోజు అగ్రిమెంట్ అయింది,ఏ రోజు పని చేశారు,ఏ రోజు బిల్లు పెట్టారో మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది గూగుల్ మ్యాప్స్ ఆధారాలతో విచారణ అవినీతిని నిరూపించడానికి మేము సాంకేతికతను వాడుతున్నాం పనులు జరిగినట్లు చెబుతున్న సమయంలో తీసిన ఫోటోలు,గూగుల్ మ్యాప్స్ లోని లాంగిట్యూడ్,లాటిట్యూడ్ మరియు లొకేషన్ వివరాలతో సహా అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి కాలువలో కనీసం మట్టి కూడా తీయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించారు,దీనిపై విజిలెన్స్ విచారణ జరగాలి-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన ఏ అధికారురిని విడిచిపెట్టం రేపు విచారణ జరిగినప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఫోటోలే మీ అవినీతికి నిదర్శనంగా నిలుస్తాయి చంద్రబాబు నాయుడు విజనరీ పాలన అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకోవడమే,కూటమి ప్రభుత్వంలో అవినీతి పాల్పడుతూ,రైతులను ఇబ్బంది గురి చేస్తున్న అధికారులపై విచారణజరిపి, తగు ఆధారాలతో నిరూపించి కఠినంగా శిక్షిస్తాం
సోమిరెడ్డి దోపిడీ -న భూతో. న భవిష్యతి “
0
4
RELATED ARTICLES
- Advertisment -


