📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రాం ఆశయ సాధన సమితి సేవలు 16...

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రాం ఆశయ సాధన సమితి సేవలు 16 గ్రామాల్లో 485 మంది విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (మే 15)  ప్రజావాణి న్యూస్ బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు,పోరుమామిళ్ళ కాశినాయన,బి.కోడూరు మండలాల్లో విద్యా చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో బాబు జగజ్జీవన్ రాం ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం నిర్వహించబడింది.మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువుతున్న 16 గ్రామాలకు చెందిన 485 మంది పేద విద్యార్థిని,విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్,హిందీ ప్రింటెడ్ కాపీ రైటింగ్ పుస్తకాలు,ఎక్కాల పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు సగిలి జాకోబ్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తో పాటు సంఘ సభ్యులు పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేయకుండా జ్ఞానం పెంపొందించుకోవడం, చేతివ్రాతను మెరుగుపరుచుకోవడం,చదువుపై ఆసక్తి పెంచుకోవడం మరియు ప్రాథమిక విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా సగిలి జాకోబ్ మాట్లాడుతూ,వేసవి కాలాన్ని ఆటపాటలకే పరిమితం చేయకుండా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు కూడా మంచి విద్యను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి”అని ఆకాంక్షించారు.గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు సమితి సభ్యులను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సమితి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రతి గ్రామానికి ఓక కార్యకర్తని ఏర్పాటు చేయాడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular