📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రూ.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ * నిరుపేదలకు అండగా నిలుస్తామన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే...

రూ.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ * నిరుపేదలకు అండగా నిలుస్తామన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

📰 Generate e-Paper Clip

 

గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) గుండె గుండెకూ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక తూర్పు కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అనుకోని అనారోగ్యం కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్నప్పుడు మేమున్నానంటూ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కేవలం 188 నెలల కాలంలోనే సుమారు రూ.11 కోట్లకుపై సీఎం రిలీఫ్ ఫండ్ నిధులతో ప్రజారోగ్యాన్ని కాపాడామని తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి మహర్దశ తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో జీజీహెచ్ ను సర్వనాశనం చేశారని, ఇప్పుడు కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా తనను సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. అనారోగ్యానికి గురైన వారు అధైర్యపడొద్దని, ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular