రూ.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ * నిరుపేదలకు అండగా నిలుస్తామన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

  గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) గుండె గుండెకూ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక తూర్పు కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అనుకోని అనారోగ్యం కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్నప్పుడు మేమున్నానంటూ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి రక్షగా...