ఘట్‌కేసర్, ఏప్రిల్ 22 (ప్రజావాణి): మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ బైరి నరేష్ అన్న 22 ఏప్రిల్చి నా చిలుగూరి ఆనంద్ నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడిపి సమాజంలో ప్రస్తుత పరిస్థితులు, ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే అంశాలపై చర్చించారు.
సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాల వల్ల పేద ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలపై బైరి నరేష్ వివరించారు. మూఢనమ్మకాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చిలుగూరి ఆనంద్ (ఎక్స్ వార్డ్ మెంబర్, ఎంపి గూడ) కుటుంబ సభ్యులు పాల్గొని, ఆయన సూచనలు ఆసక్తిగా వినడం జరిగింది.
ఈ సమావేశం ద్వారా మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.




