📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetకరీంనగర్–హైదరాబాద్ మార్గంలో డీసీఎం వ్యాన్ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో డీసీఎం వ్యాన్ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

📰 Generate e-Paper Clip

కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో డీసీఎం వ్యాన్ బోల్తా

తృటిలో తప్పిన ప్రమాదం

బెజ్జంకి, ఏప్రిల్ 23(ప్రజావాణి)

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రూమ్ షిఫ్ట్ కీ సామానులు తరలిస్తూ వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ప్రమాదం బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలోని హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడినప్పటికీ, పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లు సమాచారం.వాహనంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్టు ప్రాథమిక సమాచారం తెలియజేస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, గాయాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular