రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
భీంపల్లి శివారులో ఘటన అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ఎంజీఎంకు తరలింపు
ప్రజావాణి నవంబర్ 28
హనుమకొండ జిల్లా కమలాపూర్: కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు
సమాచారం అందుకున్న హసన్‌పర్తి 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు అంబులెన్స్ పైలట్ కేదారి ఈఎంటీ ప్రకాష్ తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్ట్రెచర్ సహాయంతో అంబులెన్స్‌లోకి తరలించి ప్రథమ చికిత్స అందించారు
అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బాధితుడిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

