📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్పూలే ఆశయ సాధన కోసం యువత ఉద్యమించాలి

పూలే ఆశయ సాధన కోసం యువత ఉద్యమించాలి

📰 Generate e-Paper Clip

కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి-బోనగిరి రూపేష్

బెజ్జంకి, నవంబర్ 28 (ప్రజావాణి)

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం యువత ఉద్యమించాలని DHPS సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బోనగిరి రూపేష్ పిలుపునిచ్చారు. AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ ఆధ్వర్యంలో బెజ్జంకిలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా యువత ఐక్యంగా పోరాడాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో AIYF మండల అధ్యక్షుడు అంతటి రాకేష్, DHPS మండల అధ్యక్షుడు రొడ్డ చరణ్, హరీష్, నరేష్, రాజు, ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.