అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై రైతులకు అవగాహన
మండల వ్యవసాయ శాఖ అధికారి బి.రామకృష్ణ
మద్దూరు నవంబర్28, ప్రజా వాణి,
మండలంలోని రేబర్తి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు విధానం పై రైతులకు పత్తి క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బూరెల రామకృష్ణ మాట్లాడుతూ
ముఖ్యంగా పత్తి సాగులో ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానం ద్వారా అధిక పత్తి మొక్కలు సాగు చేసి, దిగుబడి అధికంగా పెంచుకోవచ్చు.
ఈ విధానంలో పాటించవలసిన పంట యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యల, గురించి రైతులకు వివరించారు.
ఈ అధిక సాంద్రత ప్రతి సాగు విధానంపై రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబించి మెరుగైన దిగుబదులు పాటించి పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ,ఏఈఓ కల్పన, రైతులు వంగపల్లి సత్తయ్య శ్రీశైలం సత్తిరెడ్డి పాల్గొన్నారు.

